/rtv/media/media_files/2025/03/07/COQB5rUFGGHOzm3fprsd.jpg)
Airtel new recharge plan offers Rs 10 per day free calls and 2GB daily data
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తోంది. కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించి మరింత మంది న్యూ యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించి ఔరా అనిపిస్తోంది. తాజాగా మరో రెండు రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. 365 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీతో వీటిని అందుబాటులో ఉంచింది.
Also Read: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ
365-రోజుల ప్లాన్
వినియోగదారులు రూ.3,599 ధరతో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నంబర్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఉచిత నేషనల్ రోమింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ రీఛార్జ్ ప్యాకేజీలో భాగంగా 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMSలను లభిస్తాయి.
Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
అయితే ఈ ప్లాన్ ప్రత్యేకంగా 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. అదనంగా ఎయిర్‌టెల్ ఉచిత సేవల నుండి ప్రయోజనం పొందుతారు. దీని బట్టి చూస్తే ఈ ప్లాన్‌తో వినియోగదారులకు రోజుకు కేవలం రూ.10 మాత్రమే ఖర్చు అవుతుంది.
Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!
ఇక ఈ ప్లాన్‌తో పాటు ఎయిర్‌టెల్ రూ. 3,999 ధరకు మరో ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే అదనపు డేటా, జియోహాట్‌స్టార్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నంబర్‌కైనా అపరిమిత కాల్స్, ఫ్రీ నేషనల్ రోమింగ్, 2.5GB రోజువారీ హై-స్పీడ్ డేటాతో పాటు 100 ఉచిత SMSలను పొందుతారు. రూ. 3,599 ప్లాన్ మాదిరిగానే.. 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న వినియోగదారులకు అపరిమిత డేటాను అందిస్తుంది.
Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్