DK Aruna: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్‌ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్‌ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు.

New Update
DK Aruna: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్‌ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్‌ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం మాత్రం ఎంఐఎం నేతలు చెప్పేదే చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ మజ్లిస్‌తో కలిసి నగరంలో హింస సృష్టించాలాని చూస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నేతల దోపిడి ఎక్కువైందన్న అరుణ.. ఎంఐఎం నేతలు సైతం అవినీతికి పాల్పడుతుంటే కేసీఆర్‌ చూస్తూ ఏమీ చేయలేక పోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు.. కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీతో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. అందుకే హైదరాబాద్‌లో జరిగిన సీడ్ల్యూసీ మీటింగ్‌లో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలు కేంద్ర ప్రభుత్వంపై మాత్రమే విమర్శలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపలేదని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలను ప్రజలు నమ్మొద్దన్నారు. గతంలో సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీల్లో సగం పాతవే ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు రాజశేఖర్‌ రెడ్డి హాయాంలో అమలైన పథకమే అన్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ 2018 ఎన్నికల్లో అనౌన్స్‌ చేసిందే అన్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయన్న అరుణ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వంట గ్యాస్‌ను ఎలా 500 రూపాయలకు అందిస్తుందని ఆమె ప్రశ్నించారు.

వీటితో పాటు ప్రకటించి మరో మూడు గ్యారెంటీలను సైతం నమ్మొద్దన్నారు. కర్నాటక ఎన్నికల ముందు సైతం ఇవే హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేక పోతోందని డీకే అరుణ గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని, బీఆర్‌ఎస్‌ ఓటు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని అమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో అధికారంలోకి రాబోయేది మాత్రం బీజేపీ ప్రభుత్వమే అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనలో విసిగిపోయారని, కేసీఆర్‌ పీడ ఎప్పుడు వదిలించుకుందామా అని వారు ఎదురు చూస్తున్నారని డీకే అరుణ స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు