మరో 5 రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. అయితే తాజాగా బీజేపీ ఎంపీ, కోరుటల్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ బెటర్ అని అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అర్వింద్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ కంటే కేసీఆర్ మేలన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రం కోసం కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని పేర్కొన్నారు.
Also Read: కరీంనగర్ ఓటర్లు ఎవరి వైపు..? కారుకు మళ్లీ జై కొడతారా.. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇస్తారా?
ఇప్పుడు రేవంత్ చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడని.. చంద్రబాబుకు సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. తెలంగాణను తీసుకెళ్లి ఏపీలో ఉన్న టీడీపీ చేతిలో పెట్టినట్లేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం సంచులు మోసుకెళ్లిన రేవంత్ రెడ్డి.. తెలంగాణను హోల్‌సేల్‌గా అమ్మేస్తాడంటూ విమర్శించారు.
Also Read: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!