Rajasingh: ఏడాది తర్వాత అధికారం మాదే.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

రేపు రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని.. ఏడాది తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెప్పారు.

New Update
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు!

Rajasingh's Sensational Comments : తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)ని కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపే (గురువారం) రేవంత్ ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం అక్కడ దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంగో గోషామహల్‌ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేని చెప్పారు. ఒక్క ఏడాది మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని అన్నారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వమే వస్తుందని మాట్లాడారు. బీజేపీ వల్లే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

Also read: తెలంగాణ కాంగ్రెస్ సూపర్ స్టార్ రేవంత్ రెడ్డి.. ఆయన అభిమాన హీరో ఆ స్టార్!

రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ (Telangana) ప్రజలు మార్చేశారంటూ ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌కు 39 రాగా.. కాంగ్రెస్‌ 64 స్థానాల్లో గెలిచింది. ఇదిలాఉండగా.. రేపు రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1:42 PM గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, తెదేపా అధినేత చంద్రబాబులను కూడా ఆహ్వానించారు.

Also Read: తెలంగాణకు ఐటీ మంత్రి ఆయనే.. కేటీఆర్ కంటే డైనమిక్ అంటున్న నెటిజన్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు