Bigg Boss 7 Nominations: బిగ్ బాస్-7 లో నామినేషన్స్ రచ్చ...షో బిగిన్స్

బిగ్ బాస్-7 లో మొదటి వారం ముగిసింది మొదటివారం మామూలుగానే జరిగింది. కానీ సోమవారం మాత్రం అంతా మారిపోయింది. నామినేషన్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ చేశారు కంటెస్టెంట్స్.

Bigg Boss 7 Nominations: బిగ్ బాస్-7 లో నామినేషన్స్ రచ్చ...షో బిగిన్స్
New Update

Bigg Boss 7 Telugu Day 8 Nominations: బిగ్ బాస్-7 తెలుగు మొదలై అప్పుడై వారం మొదలైంది. ఈసారి సీజన్ మామూలుగా ఉండదు. అంతా ఉల్టా పల్టా అన్నారు. ప్రోమోలతో హడావుడి చేశారు. మొదలైన దగ్గర నుంచీ నాగార్జున (Nagarjuna) కూడా అంతా కొత్తగా ఉంటుంది అని చెబుతూనే ఉన్నారు. కానీ మొదటి వారంలో ఏం తేడా కనిపించలేదు. అంతా ఎప్పటిలానే మామూలుగా ఉంది. కేవలం కంటెస్టెంట్ లు కన్ఫార్మ్ కాకపోవడం తప్ప మిగతాది అంతా సేమ్ టూ సేమ్ సాగుతోంది.

అయితే వారం ముగిసి మళ్ళీ సోమవారం వచ్చేసరికి మాత్రం పరిస్థితి అంతా మారిపోయింది. మొదటి వారంలోనే కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయి వెళ్ళిపోయింది. ఆదివారం రాత్రి నాగార్జున వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ బెడ్ రూమ్ లోనే పడుకోమని చెప్పాడు. దాంతో విఐపీ రూమ్ లో పడుకోవడంపై గొడవ జరిగింది. రతిక (Rathika), టేస్టీ తేజ పెద్దగా అరుచుకున్నారు. వీఐపీ రూమ్ లోకి వచ్చిన వాళ్ళని అడగవా అంటూ రతిక సందీప్ ను రెచ్చగొట్టింది. దాంతో ప్రియాంక (Priyanka), శోభాశెట్టి (Shobha shetty) నేల మీదనే పడుకున్నారు. మరోవైపు బాత్రూం కడిగే విషయంలో కూడా టేస్టీ తేజ, శోభాశెట్టి గొడవ పడ్డారు.

నామినేషన్ రచ్చ...

సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ మొదలవుతాయి. ఏ సీజన్ లో అయినా అత్యంత ఇంట్రిస్టింగ్ ఎపిసోడ్ నామినేషన్సే అవుతుంది. ఈ వారం కూడా నామినేషన్స్ రచ్చరచ్చ అయింది. శివాజీ (Shivaji), పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) లు టార్గెట్ అయ్యారు. ఈ వారం నామినేషన్ కు బిగ్ బాస్ ఓ పెద్ద టబ్ లాంటిది పెట్టాడు. అందులో కంటెస్టెంట్ లు నిలబడాలి. నామినేషన్ వేసేవారు వాళ్ళ ఎదురుగా నిలబడి కారణాలు చెప్పాలి. తర్వాత వారి మీద వాటర్ కలర్ పడుతుంది. మొట్టమొదటగా పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్ ను నామినేట్ చెయ్యమని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో సందీప్ యావర్ ను నామినేట్ చేశాడు. దీంతో ప్రిన్స్-సందీప్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. తరువాత యావర్ డైరెక్ట్ గా నామినేట్ అవ్వడం వలన అతనిని మరెవ్వరూ చెయ్యడానికి వీలు లేదు అని బిగ్ బాస్ చెప్పాడు.

Also Read: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు!

big boss-7 telugu Monday nominations fight.

ప్రిన్స్ తర్వాత తేజ్ ని రతిక, ప్రశాంత్, శుభశ్రీ లు నామినేట్ చేశారు. తర్వాత వచ్చిన దామినిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు. వీళ్ళ తర్వాత బాక్స్ లోకి వచ్చిన శివాజీని అమరదీప్, ప్రియాంక, షకీలా, శోభాశెట్టి, దామిని...ఏకంగా 5గురు నామినేట్ చేశారు. అందరూ శివాజీ గురించి చాలా కారణాలు చెప్పారు. ప్రశాంత్ ని పొగుడుతఉన్నాడని, తమ మాట పట్టించుకోవడం లేదని అతని గురించి చెప్పారు కంటెస్టెంట్ లు. బాక్స్ లో నిల్చున్న శివాజీ సరిగ్గా మాట్లాడకపోవడంతో ప్రియాంక కన్నీళ్ళు కూడా పెట్టుకుంది.

ఇక ప్రశాంత్ వంతు...ఇతనిని అయితే ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. గౌతమ్, అమర్ దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక నామినేట్ చేశారు. మొదటి వారం అంతా రతికతో తిరుగుతూ ప్రశాంత్ సేఫ్ అయిపోయాడు కానీ అతను సరిగ్గా ఆడటం లేదని కంటెస్టెంట్ లు కంప్లైటం చేశారు. సెంటిమెటం పేరు చెప్పి, బిగ్ బాస్ అవకాశం కోసం స్టూడియో చుట్టూ తిరిగానని ప్రశాంత్ చెప్పడం బాలేదని అన్నారు. మరోవైపు అందరూ ఒక్కసారిగా నామినేట్ చేసేసరికి ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ప్రియాంక, అమరదీప్ తో చాలాసేపు వాదించాడు. శివాజీ కూడా అదే విధంగా వాదించాడు, ర్యాష్ గా మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ విషయంలో అమరదీప్ చెప్పిన పాయింట్లకు కంటెస్టెంట్ లు, ఆడియెన్స్ సపోర్ట్ చేశారు.

big boss-7 telugu Monday nominations fight.

మొత్తం ఎపిసోడ్ లో నామినేషన్ లో జరగాల్సిన గొడవ అయితే సక్సెస్ ఫుల్ గా జరిగింది. ప్రశాంత్, శివాజీలు తామేదో చాలా గొప్ప వాళ్ళు అయినట్టు ప్రవర్తించారు. మరి దీనిని ఆడియెన్స్ ఏ విధంగా తీసుకుంటారో, ఎవరిని ఇంటికి పంపిస్తారో తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: బ్రహ్మోత్సవం దెబ్బ తట్టుకోలేకనే పెదకాపు సినిమా తీశావా అన్నారు-శ్రీకాంత్ అడ్డాల

#season-7 #fight #nominations #telugu #big-boss #bigg-boss-7-telugu-day-8 #monday #nagarjuna #bigg-boss-7-telugu #star-maa #target #bigg-boss-7-telugu-day-8-nominations #contestants
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe