RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు!

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి మరో వ్యక్తి నుంచి ప్రశంసలు అందాయి. ఆయనే బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లులా డసిల్వా.

New Update
RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు!

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తీసిన ఆర్‌ఆర్ఆర్‌ (rrr)చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎన్నో రికార్డులను సృష్టించింది. ఎన్నో అంతర్జాతీయ వేదిక లపై తన ప్రతాపాన్ని చూపి అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. చలనచిత్ర ప్రపంచం ఎంతో గర్వించే ఆస్కార్ వేదిక మీద కూడా నాటు నాటు అంటూ స్టెప్పులేసింది.

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ సైతం ఆర్‌ఆర్ఆర్‌ చిత్రాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. ఎందరో దర్శకులు ఆర్‌ఆర్ఆర్‌ చిత్రానికి ఎన్నో కితాబులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి మరో వ్యక్తి నుంచి ప్రశంసలు అందాయి. ఆయనే బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లులా డసిల్వా.

భారతదేశంలో జరుగుతున్న జీ 20 సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడారు. భారతీయ చలన చిత్రం అయినటువంటి ఆర్‌ఆర్‌ఆర్ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. ఆర్‌ఆర్ఆర్ తప్ప తనకు ఇండియన్‌ సినిమాలేవి అంతగా నచ్చలేదని ఆయన వివరించారు.

ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర బృందాన్ని ఆయన మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌ పై బ్రిటీష్‌ అధిపత్యాన్ని తెలియజేస్తూ లోతైన విమర్శ చేయడాన్ని ఈ సినిమాలో ఎంతో అర్థవంతంగా చూపించారని పేర్కొన్నారు."ఆర్ఆర్ఆర్ దర్శకుడికి, నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని వెల్లడించారు.

ఈ సినిమా చూసిన తరువాత తనకు తెలిసినవారందరిని కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశారా అని అడుగుతున్నట్లు ఆయన వివరించారు.ఈ క్రమంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు మెచ్చుకోలు పై రాజమౌళి స్పందించారు. ఆయనకు ప్రత్యేక కృతఙ్ఙతలు తెలిపారు. ఆయన తమ టీమ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు