MLA Harish Rao: కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా? తేల్చుకోండి: హరీష్

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వృత్తుల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ బీసీబంధు పేరుతో వారికి లక్ష రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.

New Update
MLA Harish Rao: కేసీఆర్ కావాలా? కాంగ్రెస్ కావాలా? తేల్చుకోండి: హరీష్

MLA Harish Rao: రాష్ట్రంలో బీసీ బంధు (BC Bandhu) ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు.. బీసీబంధుకు అర్హులైన 300 మందికి లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం పంచాయతీ సెక్రెటరీలను రెగ్యులరైజ్ చేస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో పంచాయతి సెక్రెటరీలను రెగ్యులరైజ్ చేస్తూ నియామక పత్రాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సీఎం తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్‌(BRS) ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు కూడా పంచాయతీ సెక్రెటరీలను నియమించినట్లు మంత్రి హరీష్‌ రావు గుర్తు చేశారు. దీని వల్ల 10 వేల మందికి ఉపాధి కల్పించినట్లైందన్నారు.

దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో 3 శాతం మాత్రమే జనాభా ఉందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో 38 శాతం అవార్డులు మనకే వస్తున్నాయన్నారు. ఈ అవార్డులు రావడం వెనుక పంచాయతీ సెక్రెటరీల కృషి ఎంతో ఉందన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీలు, గ్రామాల్లో వైకుంఠ ధామం, నర్సరీలను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. గ్రామాల్లో సైతం తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని గురుకులాలు, మెడికల్ కాలేజీలను నిర్మించినట్లు తెలిపారు. విద్యార్థులపై చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా తమ గ్రామాల సమీపంలో ఉండే పట్టణాల్లోనే చదవుకునే విధంగా చేశామన్నారు.

కుల వృత్తుల వారికి సంహాయం అందించిన ప్రభుత్వం, గీత కార్మికుల పాత బకాయిలను రద్దు చేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) నేతన్నను సైతం ఆదుకున్నారని మంత్రి గుర్తు చేశారు. మగ్గమున్న ప్రతి ఒక్కరికి పెన్షన్‌తో పాటు పింఛన్ ఇస్లున్నట్లు మంత్రి తెలిపారు. సద్ది తిన్నరేవు కలవాలి అంటారన్న ఆయన.. ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలను కాపాడుకుంటున్న కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయాలని హరీష్‌ రావు కోరారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ( Congress Party)పై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్‌ రావు (MLA Harish Rao).. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నా.. విపక్ష నేతలు మాత్రం నోరుంది కదా అని లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ముడు గంటల కరెంట్‌ చాలన్న రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. రైతులు అభివృద్ధి సాదిస్తుంటే రేవంత్ రెడ్డి చూస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. గతంలో కరెంట్‌ కోతలతో రైతుల ఉసురు పోసుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్‌ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రి వెళలో రైతులు బోర్ల వద్ద పడుకునేవారని, రాత్రి సమయంలో పాములు, తేళ్లు కుట్టి అనేక మంది మృతి చెందారని మంత్రి హరీష్‌ రావు గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మళ్లీ అదే పని చేయలని చూస్తున్నారని హారీష్‌ రావు మండిపడ్డారు.

Also Read: కవిత ఢిల్లీ టూర్… షీ ద లీడర్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ….!

Advertisment
Advertisment
తాజా కథనాలు