ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే...టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య చివరి మ్యాచ్ ఆరంభం అయింది. రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్నాడు.

 ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే...టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
New Update

ఇండియా-ఆసీస్ వన్డే సీరీస్ ను 2-0తో గెలిచిన భారత్ నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవకపోయినా నష్టమేమీ లేదు. కానీ ఆస్ట్రేలియాకు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో గెలిస్తే అయినా కనీసం ఆ దేశం పరువు నిలబడుతుంది. మరోవైపు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో నంబర్ 1 గా ఉన్న టీమ్ ఇండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి ఆ ఊపులో వరల్డ్ కప్ బరిలో నిలబడాలని భావిస్తోంది.

గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరుగుతున్న ఇండియా-ఆసీస్ మూడవ వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాప్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంతకు ముందు మ్యాచ్ లలో విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్ళు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ లు తిరిగి జట్టులో కలిశారు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. మరోవైపు వైరల్ ఫీవర్ కారణంగా ఇషాన్ కిషన్ ఈ రోజు మ్యాచ్ ఆడటం లేదు.

ఫైనల్ టీమ్స్...

ఇండియా:

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా:

మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్ వుడ్

#cricket #india #australia #match #sports #bowling #one-day #third #toss #bating
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe