TG News: భాగ్యనగర్‌లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. రాజేంద్రనగర్‌లో పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు జరిపారు. గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు చేశారు. పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయారు. పోలీసులు గంజాయి ముఠాను వెంటాడి పట్టుకున్నారు. కాల్పలుతో జరగటంతో అక్కడి స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ముఠా సంభ్యుల నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయిని ఎలాగైనా అరికట్టాలని ముఠా సభ్యులు పట్టుకుని ఎందుకు రాజేందర్ నగర్‌కు వెళ్లారు. పోలీసుల జాడ కనిపెట్టిన గంజాయి ముఠా పోలీసులపై ఎదురు దాగి చేసి పరారయ్యేందుకు సిద్ధమయ్యారు. ఎట్టకేలకు గంజాయి ముఠా సభ్యులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు- గంజాయి ముఠా మధ్య కాల్పులు జరగడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం చోటుచేసుకుంది. దీంతో స్థానిక ప్రజలందరూ భయంతో పరుగులు పెట్టారు. గంజాయి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు. గంజాయి తరలింపు విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరుపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.