telangana elections:డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు-తాత్కాలిక షెడ్యూల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాత్కాలిక షెడ్యూల్ వచ్చేసింది. దీని ప్రకారం డిశంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నాలుగు రోజుల తర్వాత అంటే డిశంబర్ 11న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

telangana elections:డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు-తాత్కాలిక షెడ్యూల్
New Update

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తాత్కాలిక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీనిని అనుసరించి ఎన్నికలకు ఏఏ పనులు చేపట్టాలి, ఎప్పుడు చేపట్టాలి అనే దాన్ని నిర్దేశించారు. షెడ్యూల్ తాలూకా ఫ్లెక్సీని కార్యాలయంలో ప్రదర్శనకు కూడా ఉంచారు. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నవంబర్ 12 ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తారు. తర్వాత నవంబర్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసాక నవంబర్ 22న తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు. దీనినే ఫార్-7ఏ అని కూడా అంటారు. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగుతాయి. అక్కడి నుంచి మరో నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 11 ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుతానికి దీనిని తాత్కాలిక షెడ్యూల్ అనే చెబుతున్నా...దీనినే ఫైనల్ చేస్తారని కూడా తెలుస్తోంది. 2018లో తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ కూడా ఇదే.

డిసెంబర్ లో ఎన్నికలను నిర్వహించాలంటే అక్టోబర్, నవంబర్ లలో పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ ల ప్రాథమిక స్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. దీని తర్వాత ఎన్నికల సామాగ్రి సమీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన, నిర్ధారణ, దర్యాప్తు సంస్థల నోడల్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు, వ్యయ పర్యవేక్షణ బృందాలు, రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు వేర్వేరుగా శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు, అభ్యర్ధుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ధరల ఖరారు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్స్, వీడియో సర్వేలియన్స్ టీమ్ల ఏర్పాటు లాంటి పనులన్ని వచ్చే నెల అక్టోబర్ లోనే పూర్తి చేయాలి.

ఇక నవంబర్ లో పోలీసు అధికారులకు శిక్షణ, పోలింగ్ సిబ్బందికి ఆదేశాల జారీ, సోషల్ మీడియా మీద పర్యవేక్షణ, పోలింగ్ కేంద్రాల ప్రకటన, పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ, స్వీకరణ, సమీకృత ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, బ్యాలెట్ సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ, ఈవీఎంలకు రెండో ర్యండమైజేషన్ నిర్వహణ, వ్యయ పరిశీలకులకు శిక్షణ లాంటి పనులన్నీ అక్టోబర్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

డిసెంబర్ 7 లోపు పోలింగ్ సిబ్బందికి తుది శిక్షణ, పోలింగ్ కేంద్రాలకు రవాణా సదుపాయ కల్పన, పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం అమ్మకాల మీద నిషేధం, పోలింగ్, కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలి. అక్టోబర్ మొదటి వారం తర్వాత తెలంగాణతో సహా ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసన సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ అక్టోబర్ 3 నుంచి మూడు రోజుల పాటూ పర్యటించనుంది. దీని తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు.

#elections #telangana #politics #schedule #date #assembly #cec #state #national
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe