Asaduddin Owaisi: జమ్ముకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌పై అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్‌ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్‌ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్‌ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్‌-భారత్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు.

New Update
Asaduddin Owaisi: జమ్ముకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌పై అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్‌ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్‌ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్‌ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్‌-భారత్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు. ఇటీవలే ఆసియా కప్‌లో భారత్‌ పాక్‌ టీమ్‌లు రెండు సార్లు తలపడ్డాయన్న ఆయన.. ఇరు దేశాల జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగితేనే నాలుగు రోజులుగా పాక్‌ నుంచి బులెట్ల వర్షం కురుస్తొందన్నారు.

మరోవైపు వచ్చే నెలలో భారత్‌లో వన్డే వరల్డ్‌ కప్‌ జరుగుతుందన్న ఆయన.. పాకిస్థాన్‌ టీమ్‌ భారత్‌లో పర్యటించనుందన్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కాకముందే ప్రధాని మోడీ పాక్‌ నుంచి వస్తున్న బులెట్లను ఆపాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా కప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఒక్కసారి ఓడిపోయినందుకే పాక్‌ నుంచి నాలుగు రోజులుగా బులెట్లు దూసుకొస్తున్నాయన్నారు. మరి వచ్చే నెలలో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌ కప్‌లో పాక్‌ టీమ్‌ గుజరాత్‌లో మ్యాచ్‌లు ఆడుతుందని, ఆ టోర్నీలో భారత్‌-పాక్‌ టీమ్‌లు ఎన్ని సార్లు తలపడుతాయే తెలిదన్నారు.

భారత్‌ చేతిలో పాక్‌ టీమ్ ఓడిన ప్రతీసారి సరిహద్దుల్లొ బులెట్ల వర్షం కురుస్తూనే ఉంటుందని, ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బులెట్ల వర్షాన్ని ఆపాలని సూచించారు. భారత సైనికులు జీవితాలు ముగిసిపోకుండా భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. భారత ప్రభుత్వం పాక్‌ నుంచి వచ్చే బులెట్లను ఆపడంలో విఫలమైతే భారత్‌-పాక్ దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహించకూడదన్నారు.

Advertisment
తాజా కథనాలు