Nara Lokesh: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఆయన ట్విట్టర్ (X)లో జగన్ పై విమర్శలు గుప్పించారు. " మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జగన్ తాడేపల్లి ముఠానా? టెర్రరిస్టుని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? శరత్‌కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టిడిపి నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం. శరత్‌ని తక్షణమే విడుదల చేయాలి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం. జగన్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆపకపోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది." అంటూ రాసుకొచ్చారు.
అసలేం జరిగిందంటే..
ఏపీలో మరికొన్ని నెలల్లో లేదు మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. ఈ సారి టీడీపీకి నేతల రాజీనామా కాదు.. అదేంటంటే టీడీపీ (TDP) మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకును పోలీసులు అరెస్ట్ చేయడమే. జీఎస్టీ (GST) ఎగవేశారన్న ఆరోపణలతో శరత్ పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: వైరల్‌గా మారిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్!
ఇది వైసీపీ కుట్ర: ప్రత్తిపాటి
తన కొడుకు శరత్ అరెస్ట్ కావడంపై స్పందించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఓటమి భయంతో సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ క్షేత్రంలో ఎదురుకోలేక తప్పుడు కేసులతో వేధిస్తున్నారని అన్నారు. కంపెనీ డైరెక్టర్ గా కానీ.. కనీసం కంపెనీ షేర్ హోల్డర్ గా కానీ శరత్ లేదని తేల్చి చెప్పారు.కంపెనీకి సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు ఏమి సంబంధం అని ప్రశ్నించారు. జగన్ కుట్రలో భాగంగానే పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేశారని ఆరోపించారు.