Jithender Reddy: వైరల్‌గా మారిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్! బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విట్టర్ (X)లో 'వాట్ టు డు, వాట్ నాట్ టు డు' అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నా ఆయనకు టికెట్ వస్తుందా? లేదా? అని అనుమానంతో ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం హెడ్‌లైన్‌పై క్లిక్ చేయండి. By V.J Reddy 29 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Jithender Reddy: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గురువారం నాడు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. బట్టలు లేకుండా ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ రాజకీయాలపైనే జితేందర్ రెడ్డి ఇలా సెటైరికల్ కామెంట్స్ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. What to do,what not to do.Thinking before elections.@narendramodi @AmitShah @sunilbansalbjp @tarunchughbjp @JPNadda @shivprakashbjp @BJP4India @BJP4Telangana pic.twitter.com/QYvt5xR7Ge — AP Jithender Reddy (@apjithender) February 29, 2024 అసలేం జరిగిందంటే.. ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ కామెంట్ పెట్టి.. ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా అటు ఇటు తిరుగుతూ థింక్ చేస్తూ ఉంటాడు. అయితే.. ఈ వీడియోను ప్రధాని మోడీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, జేపీ నడ్డా, శివప్రకాశ్కు, తెలంగాణ బీజేపీకి జితేందర్ రెడ్డి ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి బీజేపీ తరపున మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పెట్టిన పోస్టు ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరు అలా ఉందనే అర్థం చేసుకోవాలా? లేక మరేదైనా అర్థం వచ్చేలా పెట్టారా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలోనూ దున్నపోతులను వాహనంలో ఎక్కించి కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బీజేపీలో పెను దుమారం చోటుచేసుకుంది. పార్టీ నేతలకు అదేవిధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్ధం వచ్చేలా నాడు వీడియో షేర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా గురువారం నాడు పోస్టు చేసిన వీడియో హాట్ టాపిక్‌గా మారింది. #modi #bjp #telangana #jithender-reddy #bjp-kishan-reddy #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి