YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీలో దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని జాతీయ నేతలను కలిసి తమ పోరాటానికి మద్దతు కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని వారిని కోరారు.

New Update
YS Sharmila: ఏపీ సీఎం జగన్ పై దాడి దురదృష్టకరం..వైఎస్ షర్మిల ట్వీట్..!

APCC Chief YS Sharmila Deeksha in Delhi: ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడుగా వ్యహరిస్తున్నారు. తనదైన శైలిలో ప్రభుత్వంపై, ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్నది తన అన్న సీఎం జగన్ (CM Jagan) అయిన సరే ఏపీ అభివృద్ధిపై నిలదీస్తున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నప్పటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) ఇవ్వాలనే డిమాండ్ ను కేంద్రం ముందుకు తీసుకెళ్లింది. తాజాగా దీనిపై ఆమె దీక్షకు దిగారు.

ALSO READ: స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ

ఢిల్లీలో షర్మిల దీక్ష..

ఏపీ స్పెషల్ స్టేటస్ ఫైట్ ఢిల్లీకి (Delhi) చేరింది. దేశ రాజధాని వేదికగా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం 2గంటలకు ఏపీ భవన్ (AP Bhavan) లో దీక్షకు దిగారు షర్మిల. సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన చేపట్టనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. షర్మిల చేపట్టిన ఈ దీక్షకు ఏపీ నుంచి ఢిల్లీకి భారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.

జాతీయ నేతల మద్దతు..

ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో ఢిల్లీలో దీక్షకు దిగిన వైఎస్ షర్మిల.. ఢిల్లీలోని జాతీయ పార్టీల నేతలందరినీ కలిసి మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగా NCP చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు పోరాటంలో తమకు మద్దతివ్వాలని కోరారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ (Manickam Tagore) లను కలిసి ధర్నాకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక DMK నేత తిరిచ్చి శివ, CPMనేత సీతారాం ఏచూరీలను కలిసి ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై వివరించారు. APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సమక్షంలో DMK ఎంపీ తిరుచ్చి శివ ను కలిసింది కాంగ్రెస్ నేతల బృందం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్ లో చర్చకు పట్టుబట్టాలని వినతి పత్రాన్ని షర్మిల వారికి ఇచ్చింది.

ఇదే కారణమా..?

వైఎస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వడం వల్ల ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె రాష్ట్రంలో అంశాలపై పోరాటాలు చేస్తే.. అప్పుడు ఆమె స్థాయి.. రాష్ట్రంలో నేతలకే పరిమితం అవుతుందని... అలా కాకుండా జాతీయ స్థాయిలో పోరాటాలు చేయడం ద్వారా.. తమ పార్టీ జాతీయ పార్టీ అని గుర్తు చెయ్యడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాష్ట్రంలో ప్రత్యేక హోదాతోపాటూ.. చాలా సమస్యలున్నాయి. వాటిపై కాకుండా ప్రత్యేక హోదాపైనే షర్మిల ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనేది ఎన్నికల ఫలితాల తరువాత తెలుస్తోంది.

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు