ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. ఆరోజున జరగనున్న పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జరగబోయే ప్రజావేదిక కార్యక్రమలో సీఎం.. పింఛను లబ్ధిదారుల, ప్రజలతో ముచ్చటించనున్నారు.
Also Read: టీటీడీ ఛైర్మన్ పదవి వారికేనా..?
రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మె్ల్యేలు పాల్గొననున్నారు. జులై 1న పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి కావాలని.. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరభ్‌కుమార్ జల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలాఉండగా.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నామని ఇటీవల చంద్రబాబు అన్నారు. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక మూడు నెలలకు పెంచిన రూ.3 వేలను.. జులై నుంచి ఇవ్వనున్న రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు అందించనున్నామని వెల్లడించారు.
Also read: అంతా వాళ్లే చేశారు.. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు