Andhra Pradesh: టీటీడీ ఛైర్మన్ పదవి వారికేనా..?

ఏపీలో టీటీడీ ఛైర్మన్ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో టీవీ5 అధినేత బీఆర్‌ నాయుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛైర్మన్ పదవి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
Andhra Pradesh: టీటీడీ ఛైర్మన్ పదవి వారికేనా..?

TTD Chairman: ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో టీవీ5 అధినేత బీఆర్‌ నాయుడు (TV5 Chairman BR Naidu), టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) ఉన్నారు. ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరికి ఛైర్మన్ పదవి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఇదిలాఉండగా.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. టీటీడీ ఛైర్మన్‌ పదవికి భూమన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఛైర్మన్‌ ఎవరూ అనేదానిపై అధికారిక ప్రకటన రానుంది.

Also Read: అంతా వాళ్లే చేశారు.. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

#telugu-news #national-news #ttd
Advertisment
తాజా కథనాలు