Election Counting : మొదలైన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్!

తీవ్ర  ఉత్కంఠ నెలకొన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో  కౌంటింగ్ జరుగుతోంది.  ఒ

New Update
counting

తీవ్ర  ఉత్కంఠ నెలకొన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో  కౌంటింగ్ జరుగుతోంది.  ఒకే రౌండ్‌లో పులివెందుల ZPTC కౌంటింగ్, మూడు రౌండ్లలో ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్ పూర్తికానుంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడనున్నాయి. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 9066 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం ఓట్లు 24,606 కాగా20,681 ఓట్లు పోలయ్యాయి. పులివెందుల ఫలితంపై జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

పులివెందుల ఉప ఎన్నికలో

పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్‌ను 10 టేబుళ్లపై ఒక రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్‌ను 10 టేబుళ్లపై సుమారు 3 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు చొప్పున ఉన్నారు. సూపర్వైజర్లు 30 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ముగ్గురు, తదితర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు. పులివెందుల ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్‌, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్‌ నమోదైంది. 

Also read :  Coolie Twitter Review: నాగార్జున విలన్ గా చించేశాడు..రజనీకి సూపర్ హిట్..కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా ఉప ఎన్నికలు 

పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలను ఏపీలోని కూటమి, వైసీపీ పార్టీలు అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల మాజీ సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నియోజకవర్గంలో గడచిన మూడు దశాబ్ధాలుగా ఏనాడు ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుగుతున్నాయి, అయితే ఈసారి రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ స్థానాన్ని ఎలాగైన గెలుచుకోవాలని నిర్ణయించింది. దీంతో టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డికి టికెట్‌ కేటాయించింది. ఇక వైసీపీ నుంచి దివంగత జడ్పీటీసీ మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్‌ రెడ్డి బరిలో నిలిచారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, మారెడ్డి లతారెడ్డి, హేమంత్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని  వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మొదటిసారి పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ ప్రకటించింది. 

Also read :  War 2 Twitter Review: యాక్షన్ ప్రియులకు ఓకే కానీ..పాత సినిమాలో కొత్త క్యాస్టింగ్ అంతే..వార్ 2 ట్విట్టర్ రివ్యూ

Advertisment
తాజా కథనాలు