Coolie Twitter Review: నాగార్జున విలన్ గా చించేశాడు..రజనీకి సూపర్ హిట్..కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

సూపర్ స్టార్ రజనీ కాంత్ కు గోల్డెన్ ఇయర్..మన్మథుడు నాగార్జున మొదటిసారిగా విలన్ గా నటించిన కూలీ సినిమాకు సూపర్ టాక్ వినిపిస్తోంది. నాగార్జున విలన్ రూల్ లో అదరగొట్టాడని చెబుతున్నారు. ఎప్పటిలాగే రజనీ మెస్మరైజ్ చేశారని డిస్కషన్ నడుస్తోంది. 

New Update
Coolie Advance Booking

Coolie Advance Booking

రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి హేమా హేమీలు కలిసి నటించిన సినిమా కావడంతో కూలీ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. అందులోనూ రజనీకాంత్ కు గోల్డెన్ జూబ్లీ ఇయర్ కావడం, మన్మథుడు నాగార్జున మొదటిసారిగా విలన్ గా యాక్ట్ చేయడంతో తెలుగులో కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి. వీటికి తగ్గట్టుగానే బుకింగ్స్ కూడా జరిగాయి. ఇప్పుడు మొదటి షో పడిపోయింది. అన్ని చోట్లా కూలీ సినిమా గురించి పాజిటివ్ రివ్యూ వస్తోంది. నాగార్జున విలన్ గా అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. ఇక రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని..ఆయనలో గ్రేస్ అస్సలు తగ్గలేదని..తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడని అంటున్నారు. ఈ సినిమాకు మరో ప్లస్ అనిరుధ్ సంగీతం అని టాక్ నడుస్తోంది. ఎప్పటిలానే తన బీజీఎంతో అనిరుధ్ చించేశాడని..సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్ళాడని చెబుతున్నారు. 

సర్ ప్రైజ్ చేసిన నాగార్జున..

రజనీ కాంత్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా తీశారని అంటున్నారు. టైటిల్ కార్డ్, ఇంట్రో సీన్ అభిమానులకు విపరీతంగా నచ్చుతున్నాయి. నెగెటివ్ క్యారెక్టర్ లో మలయాళ నటుడు సౌబిర్ షాహిర్, ఆమిర్ ఖాన్ క్యామియో రూల్ లు చాలాబాగున్నాయి అని అంటున్నారు. ఇక సైమన్ అనే రోల్ లో నాగార్జున అయితే అందరినీ సర్ ప్రైజ్ చేశాడని చెబుతున్నారు. ఇంట్రడక్షన్ లోనే ఆశ్చపరుస్తాడని చెబుతున్నారు. ఇన్నాళ్ళూ మన్మథుడు గా అలరించిన నాగార్జునను విలన్ గా చూడడం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని...ఆయన కూడా తన యాక్టింగ్ తో గూస్ బంప్స్ తెప్పించారని అంటున్నారు. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తాయని చెబుతున్నారు. మూవీ కొంత స్లో గా నడిచినట్టు అనిపించినా యాక్టర్స్ తమ నటనతో మెస్మరైజ్ చేసేశారని మూవీ చూసిన వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికి కూలీ సినిమాపై ఫుల్ పాజిటివ్ వస్తోంది. 

Also Read: USA-Russia: ట్రంప్, పుతిన్ భేటీకి అలస్కానే ఎందుకు? రష్యాకు ఆ ప్లేస్ తో సంబంధం ఏంటి?

Advertisment
తాజా కథనాలు