War 2 Twitter Review: యాక్షన్ ప్రియులకు ఓకే కానీ..పాత సినిమాలో కొత్త క్యాస్టింగ్ అంతే..వార్ 2 ట్విట్టర్ రివ్యూ

జూనియర్ ఎన్టీయార్ మొదటిసారిగా బాలీవుడ్ లో నటించిన సినిమా వార్ 2 ప్రేక్షకుల ముందు వచ్చేసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా హృతిక్ రోషన్, తారక్ నటించి.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా యాక్షన్, డాన్స్ పరంగా బావుంది కానీ..స్టోరీ మాత్రం పాతదే అంటున్నారు. 

New Update
War 2

War 2

పాత సీసాలో కొత్త నీరు అంటే ఏంటో తెలుసా వార్ 2 సినిమా అని చెబుతున్నారు. వార్ 1లో ఉన్న నటులు మారారు తప్పితే అదే కథ, అదే కథనం అని టాక్ నడుస్తోంది. అయితే ట్రైగర్ ష్రాఫ్ కన్నా ఎన్టీయార్ వార్ 2 కు అదనపు బలంగా మారారని చెబుతున్నారు. యాక్షన్, డ్యాన్స్ లకోసం అయితే పక్కా ఈ సినిమా చూడొచ్చని చెబుతున్నారు. ఎన్టీయార్, హృతిక్ రోషన్ ఇద్దరూ ఇద్దరే. మంచి బాడీలతో ఫైట్లు, డాన్స్ లు చేస్తూ కళ్ళకు కనువిందు చేశారని టాక్ నడుస్తోంది. కానీ యాక్షన్ సినిమాలు నచ్చని వారికి మాత్రం బోర్ కొడుతుందని చెబుతున్నారు.

అయితే జూనియర్ ఎన్టీయార్ బాలీవుడ్ డెబ్యూ మాత్రం అదిరిందని అంటున్నారు. ఎప్పటిలానే మనోడు యాక్షన్ సీక్వెన్స్, డాన్స్ లలో ఇరగదీశాడని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎన్టీఆర్ కార్ ఛేజింగ్, ట్రైన్ ఫైట్ బాగున్నాయని టాక్ నడుస్తోంది. మొత్తానికి వార్ 2 బొమ్మ కొంత మంది హిట్ అంటుంటే..మరి కొంత మంది అబ్బే ఏం లేదు అని పెదవి విరుస్తున్నారు. 

ఓకే ఓకే..అంతేమీ లేదు..

ఇక వార్ 2 సినిమాలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ , తారక్ లు ఇద్దరూ పోటాపోటీగా నటించారని టాక్. ఇద్దరూ డ్యాస్న్ చేస్తుంటే రెండు కళ్ళూ చాలడం లేదని అంటున్నారు. ఫస్టాఫ్ లో ఇంట్రోలు, డ్యాన్స్ నంబర్ హైలైట్ అని చెబుతున్నారు. హీరోయిన్ కియారా అద్వానీ గ్లామర్ కూడా దీనికి యాడ్ అయిందని అంటున్నారు. అయితే మ్యూజిక్ మీద పెద్దగా టాక్ ఏమీ రాలేదు. అలాగే వీఎఫ్ ఎక్స్ లు కూడా చాలా చోట్ల బావులేవని పోస్టుటు కనిపిస్తున్నాయి. మొత్తానికి వార్ 2 మొదటి ఆట తర్వాత మిక్సడ్ టాక్ నడుస్తోంది. 

Also Read: Coolie Twitter Review: నాగార్జున విలన్ గా చించేశాడు..రజనీకి సూపర్ హిట్..కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

Advertisment
తాజా కథనాలు