Kodali Nani: కొడాలి నానికి బైపాస్ సర్జరీ.. ముంబైకి షిప్ట్!

బైపాస్ సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ముంబైలోని  ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ పాండా  బైపాస్ సర్జరీ చేయనున్నారు.  గతంలో మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు.

New Update
kodali-nani Gachibowli

kodali-nani Gachibowli

Kodali Nani: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో  ఏఐజీ ఆస్పత్రిలో చేరారు నాని. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు.. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు డాక్టర్లు. అయితే సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు.

ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో

ముంబైలోని  ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ పాండా  బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్, కొనకళ్ల నారాయణ , రఘురామకృష్ణంరాజు లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. రేపు లేదా ఎల్లుండి కొడాలి నానికి ఆయన బైపాస్ సర్జరీ చేయనున్నారు. ఇక కొడాలి నానికి ఆరోగ్యం గురించి పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకోనున్నారు

Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్

Also Read: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

Also Read:  Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్‌ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు