Bishnoi Gang: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

బిష్ణోయ్ గ్యాంగ్‌ మరో హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ నేత తారిఖ్ ఖాన్ తెలిపారు. తాము చంపబోయే వ్యక్తుల జాబితాలో నెక్స్ట్‌ నువ్వే ఉన్నావని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
SP leader gets threat call from alleged Lawrence Bishnoi gang member

SP leader gets threat call from alleged Lawrence Bishnoi gang member

గతేడాది ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యకు గరైన సంఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ బిష్ణోయ్ గ్యాంగ్‌ మరో  హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ (SP) జాతీయ ప్రతినిధి తారిఖ్ ఖాన్ తెలిపారు. 

Also Read: ఫ్రీ కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం.. అంత ఉత్తదే అంటోన్న హెచ్ సీ ఏ

గత రెండు నెలలుగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి తనకు ఫోన్‌కాల్స్‌ చేస్తూ బెదిరిస్తున్నాడని.. కానీ తాను పట్టించుకోలేదని చెప్పారు. మళ్లీ తాజాగా కాల్‌ చేసి తాము చంపబోయే వ్యక్తుల జాబితాలో నెక్స్ట్‌ నువ్వే ఉన్నావని బెదిరించారని వాపోయారు. రెండు రోజులు ఆగితే తాము ఏం చేస్తామో తెలుస్తుందని హెచ్చరించారని చెప్పుకొచ్చారు.  అయితే ఈ విషయాన్ని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు తెలియజేశానని తెలిపారు. పోలీసులకు కూడా దీనిపై ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

తారిఖ్‌ ఖాన్‌కు నిజంగానే బిష్ణోయ్ గ్యాంగ్ వ్యక్తులు ఫోన్ చేశారా ? లేదా సైబర్ నేరగాళ్లు చేశారా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయనకు రక్షణ కల్పిస్తామని కూడా హమీ ఇచ్చారు. ఇదిలాఉండగా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి పలుమార్లు సల్మాన్‌ఖాన్‌కు బెదిరంపులు వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది సల్మాన్ ఖాన్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వద్ద బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి కాల్పులు కూడా జరిపారు. ఆ తర్వాత ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీకి ఈ గ్యాంగ్‌ హత్య చేయడంతో వీళ్ల పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

Also Read: ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు...కోట్లల్లో దందా..

 ప్రస్తుతం ఈ గ్యాంగ్ లీడర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ జైల్లోనే ఉన్నాడు. బ్యారక్‌లోకి అక్రమంగా వచ్చే ఫోన్ల ద్వారా తన అనుచరుతో నిత్యం టచ్‌లో ఉంటూ హత్యలకు ప్లాన్‌లు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాబా సిద్దిఖీతో పాటు, పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలను కూడా ఇలానే హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

telugu-news | rtv-news | bishnoi-gang | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు