ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్

కుణాల్ కామ్రా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొగా తాజాగా మరో స్టాండప్‌ కమెడియన్‌ వీళ్ల సరసన చేరారు. స్వాతి సచ్‌దేవా అనే స్టాండప్ కమెడియన్.. తాను ఇబ్బందికర పరిస్తితుల్లో తల్లికి దొరికానని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

New Update
Stand-up comedian Swati Sachdeva

Stand-up comedian Swati Sachdeva

ఇటీవల యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా, స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో స్టాండప్‌ కమెడియన్‌ వీళ్ల సరసన చేరారు. స్టాండప్‌ కమెడియన్ స్వాతి సచ్‌దేవా తన తల్లితో చేయకూడని సంభాషణ చేసినట్లు ఓ షోలో చేసిన వీడియో వైరలవుతోంది.  

Also Read: హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ?

''నా వైబ్రేటర్‌ మా అమ్మకు దొరకడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఆమె నా దగ్గరికి వచ్చి, నీ స్నేహితురాలిలా నాతో మాట్లాడాలని అడిగినట్లు'' స్వాతి సచ్‌దేవా చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని భయంకరమైన కామెడీలలో ఇదొకటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేక్షకులను నవ్వించేందుకు వీళ్లు అసభ్యకరమైన విషయాలు ఎంచుకోవడం సిగ్గుచేటని మరో నెటిజన్‌ అన్నారు. స్టాండప్‌ కామెడీ షోలు సోషల్ మీడియాలో హద్దులు లేకుండా ఉన్నాయని.. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని డిమాండ్ చేస్తున్నారు.       

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చరియలు..ఆరుగురు మృతి

ఇదిలాఉండగా.. ఇటీవల ఇండియాస్ గాట్ టాలెంట్‌ షో వేదికగా యూట్యూబర్‌ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ షోలో పాల్గొన్న యువతి తల్లిదండ్రుల శృంగారంపై వ్యాఖ్యలు చేయడంతో అతడిపై కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు స్టాండప్‌ కమెడియన్ కుణాల్ కామ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదయ్యాయి. దీంతో శివసేన పార్టీ నేతలు అతడిపై కేసు పెట్టారు. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్‌లను నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

 telugu-news | rtv-news | stand-up-comedy

Advertisment
తాజా కథనాలు