ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుపై తాజాగా మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అంటూ ధ్వజమెత్తారు. '' మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది రాజకీయ కుట్ర. లిక్కర్ స్కామ్ అనేది కల్పితం మాత్రమే. తప్పులు కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ డ్రామా ఆడుతోంది.
ఇది కూడా చూడండి: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
2014-19 కాలానికి మద్యం పాలసీ కేసులో స్వయంగా చంద్రబాబే బెయిల్‌పై ఉన్నాడు. తాను తప్పించుకునేందుకే వైసీపీ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీని తప్పుడు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమే బెల్టు షాపులు పునరుద్ధరించింది. చంద్రబాబు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నాడు. ఆయనే ఇప్పుడు అవినీతి కేసుల్లో బెయిల్‌పై ఉన్నాడు. విచారణ ముసుగులో వైసీపీ నేతలను అరెస్టు చేయడమే టీడీపీ ఎజెండా'' అంటూ జగన్ తీవ్రంగా విమర్శలు చేశారు.
ఇది కూడా చూడండి: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్
ఇదిలాఉండాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి శనివారం అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ కేసులో స్పష్టంగా మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా సిట్ మిథున్ రెడ్డిని పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.