తల్లి, చెల్లి అని కూడా చూడట్లేదు.. నేను సైకోల బాధితురాలినే: షర్మిల

సోషల్ మీడియా అసభ్యకరమై పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తల్లి, చెల్లి అని చూడకుండా ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ ఆర్ కు పుట్టలేదని తనను అవమానించారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

author-image
By srinivas
YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి
New Update

YS Sharmila: పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా అసభ్యకరమై పోస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని అన్నారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారని, మహిళలు అనే జ్ఞానం లేకపోవడమే కాకుండా.. ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి అని కూడా చూడకుండా ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 

Also Read: వారిని వదిలిపెట్టొద్దు.. హోంమంత్రి అనితకు పవన్ కీలక ఆదేశాలు!

నా ఇంటి పేరు మార్చి శునకానందం..

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన షర్మిలా.. 'రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు.  సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను. అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ.. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారన్నారు. 

Also Read: Jet Airways కథ ముగిసినట్లే..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం..

అలాగే 'నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం. అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే ..భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అని అన్నారు. 

Also Read: ఎడారి దేశంలో మంచు వర్షం..!

Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్‌ మనసును గెలిచాడు.. మాటల మంత్రికుడి బర్త్‌ డే స్పెషల్!

#jagan #ys-sharmila #social-media #cm-chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe