Jet Airways కథ ముగిసినట్లే..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! ఆర్థికంగా కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ లిక్విడేషన్ ప్రక్రియకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.రుణ దాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. By Bhavana 07 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Jet Airways:దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికంగా కుదేలైన ఈ విమానాయాన సంస్థ లిక్విడేషన్ ప్రక్రియకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ ప్రయత్నాలు విఫలమైన వేళ ఈ ఆదేశాలను జారీ చేసింది. Also Read: ట్రంప్ రాకతో సీన్ రివర్స్.. పశ్చిమాసియాలో మారిన యుద్ధ వాతావరణం! రుణ దాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్ ను నియమించాలని ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ ను ఆదేశించింది. Also Read: Anil Ambani: అనిల్ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్! సుప్రీం కోర్టు ఆదేశాలతో జెట్ ఎయిర్‌వేస్ కథ ముగిసినట్లయ్యింది. ఆర్థిక కష్టాలతో జెట్ ఎయిర్ వేస్ 2019 లోనే కార్యకలాపాలు నిలిపేసింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కు వెళ్లగా..అక్కడ దివాలా ప్రక్రియ మొదలైంది. ఇందులో జలాన్-కర్లాక్ కన్సార్షియం బిడ్డింగ్ లో జెట్ ఎయిర్ వేస్ ను సొంతం చేసుకుంది. Also Read: Saudi Arabia: ఎడారి దేశంలో మంచు వర్షం..! తర్వాత కన్సార్షియానికి , రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు ఎస్‌సీఎల్‌ఏటీ కి వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ కూడా సమర్థించింది. Also Read: Pawan Kalyan: వాలంటీర్లకు బిగ్ షాక్...డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు! అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. దీని పై విచారణ జరిపిన సీజేఐ, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలను పక్కన పెట్టింది. Also Read: ''హ్యాపీ బర్త్ డే అప్పా''.. కమల్ కోసం శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్! దివాలా ప్రక్రియలో విమానాయాన సంస్థను చేజిక్కించుకున్న జలాన్ కర్లాక్ కన్షార్షియం..ఉద్యోగుల జీత భత్యాలు, నిధులు వెచ్చించడంలో విఫలమైనందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించి లిక్విడేషన్ కు ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలు, ఉద్యోగులు ఇతర భాగస్వామ్య ప్రక్షాల ప్రయోజనార్థం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ ఆస్తులను నగదుగా మార్చనున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి