ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది: షర్మిల ఫైర్

అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని.. అందుకే అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయన్నారు. 

New Update
amith sha

amith sha Photograph: (amith sha)

అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ ‌షా తీవ్ర ఆరోపణలు చేశారంటూ గత రెండు రోజులుగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. 

Aslo Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు

ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలా

అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ ‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని షర్మిల ఫైర్ అయ్యారు. గురువారం పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని.. అందుకే అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయన్నారు. 

Also Read: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!

మరో కొత్త నాటకానికి తెరతీశారు

అమిత్ షాను రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. పార్లమెంట్ లోపలికి వెళ్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీని బీజేపీ ఎంపీలు అడ్డుకుని పక్కకు తోయడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు. ఈ తోపులాటలో మల్లికార్జున ఖర్గే కిందపడిపోయారన్నారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఆవరణలోనే బీజేపీ ఎంపీలు రౌడీల్లా కర్రలు చేతబట్టి సభలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకోవడం దారుణమైన విషయం అన్నారు. 

Also Read: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఏమవుతుంది?

వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీపై నింద మోపుతున్నారని.. వారి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందన్నారు. అంబేద్కర్‌పై అమిత్ ‌షా చేసిన వ్యాఖ్యల వీడియోను డిలీట్‌ చేయాలంటూ ‘ఎక్స్‌’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందన్నారు. అంబేద్కర్‌పై బీజేపీ అసలు ఆలోచనలు.. అమిత్‌షా వ్యాఖ్యల రూపంలో బయటపడ్డాయని విమర్శించారు. 

Also Read: జహీర్ ఆ చిన్నారి బౌలింగ్ చూశావా.. వైరల్ వీడియో పోస్ట్ చేసిన సచిన్!

దేశానికి రాజ్యాంగాన్ని, కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజల జీవితాలను మార్చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ను బీజేపీ అనుక్షణం అవమానిస్తోందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కాషాయం మూకపై పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు