జహీర్ ఆ చిన్నారి బౌలింగ్ చూశావా.. వైరల్ వీడియో పోస్ట్ చేసిన సచిన్!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్నారి సుశీలా మీనా బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. జహీర్ ఖాన్ శైలిలోనే ఆమె నిప్పులు చెరిగే బంతులేస్తున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. 'జహీర్‌ నీవు ఈ వీడియో చూశావా? నీ షేడ్స్‌ కనిపిస్తున్నాయ్' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

New Update
fre

etet Photograph: (ews )

Sachin: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ చిన్నారి బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. అచ్చం స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ శైలిలోనే ఆమె నిప్పులు చెరిగే బంతులేస్తున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు సుశీలా మీనా అనే దాదాపు 12 ఏళ్ల బాలిక బౌలింగ్‌ చేస్తున్న వీడియో తనకంటపడగానే వెంటనే ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన సచిన్.. ఆ బౌలింగ్ స్టైల్ జహీర్‌ ఖాన్‌ లాగే ఉందంటూ ప్రశంసలు కురిపించారు. 

జహీర్ చూశావా.. 

అంతేకాదు తన పోస్టును జహీర్ కు ట్యాగ్‌ చేస్తూ.. ‘సున్నితమైన చేతులతో అద్భుతమైన బౌలింగ్. చూసేందుకు ఎంతో అందంగా ఉన్న సుశీలా మీనా బౌలింగ్‌ యాక్షన్‌లో నీ షేడ్స్‌ కనిపిస్తున్నాయ్. జహీర్‌ నీవు ఈ వీడియో చూశావా?’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా క్షణాల్లోనే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. చిన్నారి బౌలింగ్ స్టైల్‌ను చూసిన నెటిజన్లు ‘జూనియర్‌ జహీర్‌ ఖాన్‌' అంటూ పొగిడేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు