USA: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్

వరల్డ్ బెస్ట్ ఫైటర్ జెట్ ను అమెరికా తయారు చేస్తోందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎఫ్-47 అనే పేరుతో తమ ఆరవ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోందని చెప్పారు. తాను అమెరికాకు 47 అధ్యక్షుడు కాబట్టే..దానికి ఆ పేరు పెట్టామని తెలిపారు. 

New Update
Trump

Trump

ప్రపంచ దేశాల మీద తమ ఆధిత్యాన్ని నిరూపించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనా కంటే అన్ని రకాలుగా అమెరికా బలమైనది అనిపించుకోవాలని అనుకుంటున్నారు. సుంకాలతో ఇప్పటికే తన యుద్ధాన్ని స్టార్ట్ చేసిన ట్రంప్...ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధ విమానాల తయారీకి దిగిపోయారు. తాజాగా ప్రపంచ అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ ను అమెరికా తయారు చేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాను అమెరికాకు 47వ అధ్యక్షుడు కాబట్టి...ఫైటర్ జెట్ కు యూఎస్ ఎఫ్-47 అని పేరు పెట్టామని తెలిపారు. వేగం, చలనశీలత, ఇంకా పేలోడ్ పరంగా కూడా ఏ దేశ విమానం కూడా దానికి దగ్గరగా ఉండదని ఆయన అన్నారు. 

అత్యంత ప్రమాదకారి ఫైటర్ జెట్..

ప్రపంచంలో తొలి ఐదవ తరం యుద్ధ విమానం అయిన ఎఫ్ రాఫ్టర్ 22 స్థానంలో .. యూఎస్  ఎఫ్-47 ప్రవేశపెట్టనున్నామని ట్రంప్ చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే  F-15, F-16, F-18, F-22,  F-35 ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో F-47 కూడా చేరుతుందని తెలిపారు. ఇది అత్యంత అధునాతన, సామర్ధ్యం కల ఫైటర్ జెట్ అని..అత్యంత ప్రమాదకారి కూడా అని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు. ఈ యుద్ధ విమానాన్ని బోయింగ్ , లాక్ హీడ్ మార్టిన్ కలిపి తయారు చేశాయి.  ఈ ఫైటర్ జెట్ ను ముఖ్యంగా చైనాను ఎదుర్కోవడానికే తయారు చేశామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. అమెరికా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ (NGAD) ద్వారా ఆరో తరం విమానాలను నిర్మిస్తోంది. చైనాను దృష్టిలో ఉంచుకుని అమెరికా NGADని అభివృద్ధి చేసిందని చెప్పారు. గత ఐదు నెలలుగా ఈ జెట్ ఎగురుతోందని..దీనిపై పరీక్షలు జరుగుతున్నాయి ట్రంప్ తెలిపారు. ఈ కొత్త ఫైటర్ జెట్ 2030లలో అమెరికా వైమానిక దళంలో చేరుతుందని అన్నారు.  

today-latest-news-in-telugu | usa | china | america president donald trump 

 

Also Read: Israel: హమాస్ సైనిక నిఘా చీఫ్ ఒసామా టబాష్ అంతం

  

 

 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు