YS Jagan Meeting: జగన్ 2.0లో చంద్రబాబుకు చుక్కలే.. కార్పోరేటర్ల మీటింగ్‌లో జగన్ సంచలన వ్యాఖ్యలు!

బెజవాడ వైసీపీ కార్పోరేటర్ల భేటీలో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారని చెప్పారు. చంద్రబాబు పెడుతున్న కష్టాలకు కార్యకర్తలను చూస్తే బాధేస్తుందన్నారు. తమ కార్యకర్తలు, నేతలను ఇబ్బందిపెట్టిన వారిని ఎవరినీ వదలనంటూ హెచ్చరించారు.

New Update
JAGAN-CHANDRABABU-jpg

YS Jagan sensational comments on cm chandrababau

YS Jagan Meeting: బెజవాడ వైసీపీ కార్పోరేటర్లతో భేటీ అయిన వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0ను చూస్తారని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్ధ వైయస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారని చెప్పారు. ఈ 2.0 వేరేగా ఉంటుందని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని, వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూస్తే బాధేస్తోందని, ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

Also Read: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

చంద్రముఖిని నిద్రలేపడమే..

విజయవాడ కార్పొరేషన్‌లో 64 స్దానాలుంటే 49 స్దానాలు అప్పట్లో మనం గెలిచాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్ధానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్ధానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలు పెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారని చెప్పడానికి గర్వపడుతున్నా. ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎట్లో నా చెవిలో చెబితే నేను తెలుసుకుంటానంటున్నాడు. ఇదే మాటను ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పాను. మన మేనిఫెస్టోను, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది.. ఈ రాష్ట్రాన్ని మరో 30 ఏళ్లు ఏలుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also Read:  Woman Kills Lover: భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ప్రియుడితో శృంగారం.. చివరికి ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్!

మీ జగన్ అండగా ఉంటాడు..

అలాగే కార్యకర్తలు, వైసీపీ నేతలు ఒక్కటే గుర్తు పెట్టుకొండి. జగనన్న 1.0 లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయిండవచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్ధలను చూశాను. వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడంటూ హమీ ఇచ్చారు. 

Also Read: బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. బైక్‌పై వెళ్తున్న వారి గొంతులు కోసి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు