YS Jagan: సింగయ్య మృతి కేసు.. నేడు జగన్ పిటిషన్ విచారణ

జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను నేడు విచారణ జరగనుంది. సింగయ్య మృతిపై ఏ2గా ఉన్న జగన్‌ తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు పర్యటనలో భాగంగా జగన్ వాహనం కింద సింగయ్య మృతి చెందాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
JAGAN

గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరారు. గార్డులతో కలిపి వాహనం మొత్తం బరువు దాదాపుగా 4000 కిలోలు ఉంటుందని, సింగయ్య ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే వాహనం కిందపడినట్లు లేదని జగన్ అన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని జగన్ ఆరోపించారు. అయితే ఈ కేసులో జగన్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించనుంది. ఈ కేసులో జగన్‌ను ఏ2గా పోలీసులు చేర్చారు.

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

సీసీ ఫుటేజీల ఆధారంగా..

ఇదిలా ఉండగా ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా BNS 105, 49 సెక్షన్లను చేర్చారు. హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమీసైడ్‌‌ని BNS 105 సెక్షన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్‌ దృశ్యాలన్నింటినీ విశ్లేషించి ఇది కల్పబుల్‌ హోమీసైడ్ అని ఈ సెక్షన్‌ జత చేశారు. వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్‌ పెడతారు.

ఇది కూడా చూడండి:Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

జగన్‌ సహా మిగతా నిందితులపై ఈ సెక్షనే పెట్టారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్‌ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5నుంచి-10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించేందవచ్చు. ఇది నాన్‌  బెయిల్‌బుల్‌ సెక్షన్‌. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై BNS 49 సెక్షన్‌ను ఈ కేసులో చేర్చారు. మొదట నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని బీఎన్‌ఎస్‌ 106(1)) సెక్షన్‌ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దానికి మరో రెండు సెక్షన్లు యాడ్ చేశారు.

ఇది కూడా చూడండి:Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

Advertisment
తాజా కథనాలు