Alliance MLC candidates: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో తీవ్రపోటీ నెలకొంది. ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా.. మిగతా నాలుగు స్థానాలపై దాదాపు 25 మంది ఆశలు పెట్టుకున్నారు. 10 మంది వరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో 4గురు అదృష్టవంతులెవరో?

New Update
 This Article is From Feb 24, 2024Chandrababu Naidu, Pawan Kalyan

This Article is From Feb 24, 2024Chandrababu Naidu, Pawan Kalyan

Alliance MLC candidates : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో తీవ్రపోటీ నెలకొంది. ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా.. మిగతా నాలుగు స్థానాలపై దాదాపు 25 మంది ఆశలు పెట్టుకున్నారు. 10 మంది వరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజులుగా అసెంబ్లీ పరిసరాల్లో ఎమ్మెల్సీ ఆశావహుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు సీఎం చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి మనసులో మాట చెప్పుకుంటుంటే ఇంకొందరు నాయకుల ద్వారా రాయబారం నడుపుతున్నారు. ఈ నెల పదో తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో, సమయం దగ్గరపడేకొద్దీ వీరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఇంత వరకు అభ్యర్థుల నిర్ణయంపై ఎలాంటి సంకేతాలూ లేవు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు సోమవారం ఒక్కరోజే సమయం ఉంది. తెదేపా అభ్యర్థులు ఎవరన్న విషయంలో శనివారంనాటికి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  

ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

  ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీల్లోనూ కొందరు మళ్లీ అవకాశమివ్వమని అడుగుతున్నారు. చంద్రబాబు, లోకేశ్‌.. తమను కలిసినవారందరి విజ్ఞప్తులూ వింటున్నారు. ఇంత వరకు వారు ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీవర్గాల సమాచారం. అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రస్తావన వస్తోంది. రకరకాల సమీకరణాలను వివరిస్తూ.. ఫలానావారికి అవకాశం దక్కవచ్చంటూ ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. కచ్చితంగా తమకు అవకాశం వస్తుందన్న నమ్మకంతో కొందరు నాయకులు నామినేషన్‌ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారందరికీ ఇప్పుడు అవకాశం ఇవ్వలేరు కాబట్టి.. వారిలో కొందరిని రాబోయే రోజుల్లో కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించే అవకాశముంది. జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వాలని నరసరావుపేట ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబును కలిసి కోరారు. ఆయనను ఇప్పటికే తితిదే బోర్డు సభ్యుడిగా నియమించినందున ఎమ్మెల్సీ పదవికి పరిగణనలోకి తీసుకుంటారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.    

Also Read: Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

ఎమ్మేల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ రేపు ముగియనున్నందున ఈరోజు సాయంత్రం అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తం ఐదు స్థానాలకు గాను ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా ఆ స్థానం నుంచి ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగతా నాలుగు స్థానాలకు టీడీపీలో 32 మంది పోటీ     పడుతున్నారు. అయితే సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...సోమవారంతో ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగింపు


బీసీ, ఎస్సీలతో పాటు ఒక ఓసీకి అవకాశం దక్కుతుందని అంతా అనుకుంటున్నారు. ---రేసులో బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్న,కేఈ కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి. పీతల సుజాత, జవహర్, ప్రభాకర్,కొమ్మాలపాటి శ్రీధర్,---ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి, వంగవీటి రాధ, అశోక్ బాబు, వర్మ సత్యనారాయణరాజు తదితరులున్నారు.

Also Read: SLBC breaking : టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి....కార్మికుల ఆన‌వాళ్లు గుర్తించిన కేర‌ళ జాగిలాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు