Pulivendula ZPTC By election : పులివెందులలో నువ్వా..నేనా... బాబు, జగన్ కు ప్రతిష్టాత్మకంగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక
కడపజిల్లా పులివెందులలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ టీడీపీ, వైసీపీల మధ్య యుద్ధాన్ని తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడ గెలుపు టీడీపీ-వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది.