/rtv/media/media_files/2025/08/10/zilla-parishat-high-school-2025-08-10-14-00-07.jpg)
Zilla Parishat High School
S*exual harassment : ఉపాధ్యాయుడు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవ స్థానం కలిగినవాడు. విద్యార్థులను తన కన్న బిడ్డల్లా చూసుకోవలసిన వాడు. కానీ కొంతమంది చదువుకున్న మూర్కులు. ఒక గౌరవ ప్రదమైన ప్రధాన వృత్తిలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోయి పాడు పనులకు పాల్పడుతున్నారు. వావి వరుసలు, వయసు తారతమ్యాలు మరిచి ప్రవర్తిస్తున్నారు.
ఇది కూడా చూడండి:KTR vs Bandi Sanjay : బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్
తాజాగా, ఏపీ ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పాఠశాలకు చెందిన విద్యార్థినీలు పలువురు లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సుమారు 25 మంది విద్యార్థినీలు సోషల్ ఆడిట్ కోసం వచ్చిన అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడిపై 25 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయుడు తమను చెప్పరానీ చోట తాకుతూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని వారు రాసిన లేఖలో వివరించారు. తమతో పాటు ఇంకా చాలామంది బాధితులు ఉన్నప్పటికీ, వారు భయంతో చెప్పలేకపోతున్నారని తమ లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్
ఆ ఉపాధ్యాయుడు చేస్తున్న వేకిలి చేష్టల గురించి కొంతమంది ఉపాధ్యాయులకు చెప్పినప్పటికీ, వారు హెచ్‌ఎంకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఏ మాత్రం స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. హెచ్‌ఎం స్పందించకపోవడంతో అధికారులకు ఫిర్యాలు చేయాల్సి వచ్చిందని విద్యార్థులు తెలిపారు. కాగా విద్యార్థులు తమ దృష్టికి తెచ్చిన సమస్యను అడిట్ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఈఓ సదరు ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశాలు జారీ చేయించారు. ఎన్టీఆర్ జిల్లా డీఈవో యువి సుబ్బారావు ఆదేశాల మేరకు.. రేపు ఉదయం 11 గంటలకు చందర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విచారణ జరపనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారి సాంబశివరావు విచారణకు హాజరవుతారు.
ఇది కూడా చూడండి:Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు