నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
AP: ఈరోజు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొననున్నారు.
AP: ఈరోజు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొననున్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ తుఫాన్ హెచ్చరిక ఉంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడి ఊపరాడకపోవడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా.. 17 మందికి పైగా తీవ్ర గాాయాల పాలయ్యారు.
దేశ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని...దీని కారణంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అది గమనించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న తండ్రి కూతురిని రక్షించాడు. సాయిబాబు సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు.
ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంటలో విషాదం జరిగింది. రెండు రోజుల క్రితం కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు పోలవరం కుడి కాలువలో పడి చనిపోయారు. దీంతో రెండు రోజులుగా ఎక్కిఎక్కి ఏడ్చిన భార్య తీవ్ర మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
AP: పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై పవన కళ్యాణ్ స్పందించారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
AP: మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులతో బ్యాంకులు పనిచేయవని దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెల 11 వరకు దరఖాస్తులకు సమయాన్ని పొడిగించింది.