Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. By Bhavana 13 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి AP Deputy Speaker: ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పేరును మంగళవారం ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ, గురు వారాల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనప్రాయం మాత్రమే. Also Read: NBK 109 : బాలయ్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. 'NBK 109' టీజర్ లోడింగ్ 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్ సభ స్థానం నుంచి వైసీపీ తరుఫున గెలిచారు. తరువాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం పై తిరగబడ్డారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతిని, అక్రమాలను ప్రజలకు తెలియజేశారు. Also Read: సీక్రెట్ క్యాంప్ లో భారత్ ప్రాక్టీస్.. వాటిపై నిషేధం విధించిన బోర్డ్ దీంతో వైసీపీ ప్రభుత్వం ఆయన పై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన సంగతి తెలిసిందే. జగన్ వ్యవహారాలను గురించి మాట్లాడటం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఏపీలో అడుగుపెట్టలేదు. చాలా సంవత్సరాలు ఢిల్లీలోనే ఉండి ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీకి తిరిగి వచ్చారు. Also Read: వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పరీక్షల్లో మార్పులు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన 2024 ఎన్నికల ముందు ఆయన వైసీపీ కి రాజీనామా చేసి టీడీపీలో చేరి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. Also Read: BY Poll: రేపు వాయనాడ్‌తో పాటూ 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ను నియమించిన ప్రభుత్వం ఈరోజు శాసనసభ, ఆసన మండలి విప్, ఛీఫ్ విప్‌లను నియమించింది. ఏపీ శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ తెదేపా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్‌విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఇందులో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ ఎమ్మెల్యేలకు విప్‌లుగా అవకాశం లభించింది. శాసనసభలో విప్‌లు వీరే.. ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు(బీజేపీ)అరవ శ్రీధర్, కోడూరు -ఎస్సీ(జనసేన)బెందాళం అశోక్ - ఇచ్ఛాపురం (టీడీపీ)బొలిశెట్టి శ్రీనివాస్- తాడేపల్లిగూడెం (జనసేన)బొమ్మిడి నారాయణ నాయకర్- నరసాపురం (జనసేన)బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్ (టీడీపీ)దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు)- ముమ్మిడివరం (టీడీపీ)దివ్య యనమల- తుని (టీడీపీ)వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు(ఎస్సీ) (టీడీపీ)జగదీశ్వరి తోయక - కురుపాం(ఎస్టీ) (టీడీపీ)కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)మాధవి రెడ్డప్పగారి - కడప (టీడీపీ)పీజీవీఆర్ నాయుడు(గణబాబు)- విశాఖ వెస్ట్(టీడీపీ)తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ) (టీడీపీ)యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం (టీడీపీ) శాసనమండలిలో విప్లువేపాడ చిరంజీవి రావు(టీడీపీ)కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)పి.హరిప్రసాద్ (జనసేన) #ap-assembly #rtv #chandrababu #ap-deputy-speaker #Raghu Rama Krishnam Raju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి