Aghori: అఘోరీ సంచలనం.. మసీదులన్నీ కూల్చేస్తా అంటూ షాకింగ్ వ్యాఖ్యలు అఘోరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న అఘోరి హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని.. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది. By Seetha Ram 17 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలో సంచలనం రేపిన అఘోరీ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో పలు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే షాకింగ్ వ్యాఖ్యలు చేస్తుంది. ఇక తాజాగా హైదరాబాద్ చేరుకున్న అఘోరి వరంగల్‌లో ప్రత్యక్షమైంది. ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓ స్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అనంతరం ఆమె భద్రకాళి అమ్మవారి ఆలయానికి కాలినడకన వెళ్లి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. పూజలు చేసిన అనంతరం అఘోరి మీడియాతో మాట్లాడింది. అత్యాచారాలు, గోహత్యల నివారణకే పూజలు చేశానని తెలిపింది. అంతేకాకుండా లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని పేర్కొంది. అలాగే హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కొయ్యబోతున్నానంటూ ఇటీవల హెచ్చరించింది. అదే సమయంలో అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చింది. ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యలను ఆపుదాం. ప్రకృతిని కాపాడాలని నా గురువు చెప్పారు. ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! ఇందుకోసం కూడా తన పోరాటం ఉంటుందన్నారు. చాలా మంది అఘోరీలు కూడా ఇందుకోసం రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలో కుంభమేళ ఉందని.. అది అయిపోయాక కలిసి పోరాడుతాం అని తెలిపారు. అఘోరికి వస్త్రధారణ ఇదిలా ఉంటే అఘోరీ తాజాగా కొత్త రూపం దాల్చింది. ఏపీలో పలు ఆలయాలను సందర్శిస్తున్న ఆమె తాజాగా తణుకులోని 14 పీఠాలకు అధిపతి అయిన గురువు రాజేష్‌నాథ్ వద్దకు చేరుకుంది. అక్కడ గురువు రాజేష్‌నాథ్ అఘోరికి వస్త్రధారణ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు మసీదులన్నీ కూల్చేస్తా ఇక ఇప్పుడు మరోసారి అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్న ప్రతి మసీదును కూల్చేస్తా అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలతో తనకు పనిలేదని తెలిపింది. తన పని తాను చేసుకుని పోతానని పేర్కొంది. ఆడపిల్ల మీద చేయి వేస్తే అది కోసేస్తా అని తెలిపింది. ధర్మం తర్వాతే ఏదైనా, ఎవరైనా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో ప్రస్తుతం అఘోరి ఉంది. ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా #andhra-pradesh #lady aghori #west-godavari-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి