Anantapur : అన్నా వదినా అంటూ ఫ్రెండ్ లవర్తో సరసాలు.. స్వాతి కేసులో బిగ్ ట్విస్ట్!

ఒకే వ్యక్తిని ఇద్దరూ  ప్రేమించారు. ప్రియుడు ఇద్దరితోనే ప్రేమ వ్యవహారాన్ని బాగానే నడిపించాడు. కానీ ఇద్దరూ ప్రియురాళ్లకు ఈ విషయం తెలియడంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.

New Update
swathi

ఒకే వ్యక్తిని ఇద్దరూ  ప్రేమించారు. ప్రియుడు ఇద్దరితోనే ప్రేమ వ్యవహారాన్ని బాగానే నడిపించాడు. కానీ ఇద్దరూ ప్రియురాళ్లకు ఈ విషయం తెలియడంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గుత్తి ప్రాంతానికి చెందిన అరుణ్‌కుమార్, పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన స్వాతి (22), మరో యువతి ప్రతిభాభారతి అనంతపురం సాయినగర్‌ మూడో క్రాస్‌లో ఉన్న దీపు బ్లడ్‌ బ్యాంకులో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లుగా వర్క్ చేస్తున్నారు. అయితే అరుణ్‌కుమార్, ప్రతిభాభారతి ఇద్దరూ రెండేళ్లుగా లవ్ లో ఉన్నారు. వారితో స్వాతి అన్నా వదినా అంటూ సన్నిహితంగా ఉండేది. అయితే ప్రతిభాభారతికి తెలియకుండా రహస్యంగా అరుణ్‌, స్వాతి  ప్రేమ వ్యవహారం నడిపారు. ఈ విషయం ప్రతిభాభారతికి తెలిసిపోయింది. 

అన్నా వదినా అంటూ

దీంతో సోమవారం ఉదయం ఏడు గంటల టైమ్ లో స్వాతికి ఫోన్‌ చేసిన ప్రతిభాభారతి  దారుణంగా తిట్టింది. అన్నా వదినా అంటూ నా ప్రియుడితోనే ప్రేమ వ్యవహారం నడుపుతావా? మీ ఇద్దరి విషయం నాకు తెలిసిపోయింది. ఈ రోజు ల్యాబ్‌ దగ్గరకు రండి. మీ కథ తేలుస్తానని స్వాతిని బెదిరించింది. దీంతో భయపడిపోయిన స్వాతి..  తాను ఉంటున్న హాస్టల్ ఎవరూలేని  టైమ్ చూసి గదిలోని ఫ్యాన్‌కు చున్నీ బిగించుకుని అత్మహత్యకు పాల్పడింది. అయితే స్నేహితురాళ్లు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే స్వాతి చనిపోయినట్లుగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని రెండో పట్టణ సీఐ శ్రీకాంత్‌ వివరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. 

Also Read:Rasha Thadani: అప్పుడు మిస్.. ఇప్పుడు జాక్ పాట్! ఘట్టమనేని హీరోతో ర‌వీనా టాండ‌న్ కూతురు

భద్రాచలంలో దారుణం

భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్(gangrape) జరగడం కలకలం రేపుతోంది. ఆ బాలికను ఆటోలు తీసుకెళ్లిన డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళగా పోలీసులు గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడ వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ సమయంలోనే ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్‌డ్రింగ్‌లో మత్తమందు కలిపి ఇచ్చారు. అనంతరం గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.  చివరికి స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆ బాలిక శరీరంపై పంటిగాట్లు, గాయాలు ఉన్నాయని గుర్తించి  అత్యాచారం కేసు చేశారు. చర్ల, దుమ్ముగూడెం, పాల్పంచ స్టేషన్ల పరిధిలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.     

Also Read: Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ

Advertisment
తాజా కథనాలు