/rtv/media/media_files/2025/09/18/road-accident-2025-09-18-16-15-06.jpg)
Road Accident
పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్ జిల్లాలోని చాంద్‌భన్ గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న హోండా సిటీ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ విషాద ఘటనలో ఇద్దరు మహిళలు, 11 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని కోట్కాపుర ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Punjab Road Accident
చాంద్ భాన్ గ్రామానికి చెందిన కొందరు తమ ఫ్యామిలీతో కలిసి హూండా సిటీ కారులో జైటోలోని బ్రార్ ప్యాలెస్‌లో జరిగిన వివాహ వేడుకకు పయణమయ్యారు. ఇలా బయల్దేరిన కాసేపటికే భారీ యాక్సిడెంట్ జరిగింది. వారు చాంద్ భాన్ గ్రామం నుండి బయల్దేరి కిలో మీటరు ప్రయాణించిన తర్వాత కారు అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెట్లను బలంగా ఢీకొట్టింది.
ఈ యాక్సిడెంట్ అత్యంత తీవ్రంగా ఉండటంతో కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైంది. అదే సమయంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంటనే జైటో సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స తర్వాత, వైద్యులు వారిని సివిల్ హాస్పిటల్ కోట్కాపురకు రిఫర్ చేశారు.
అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అతివేగం లేదా అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Follow Us