/rtv/media/media_files/2025/11/09/nandurbar-school-bus-accident-2025-11-09-20-56-44.jpg)
nandurbar school bus accident
School Bus Accident: మహారాష్ట్ర నందూర్బార్‌లోని అక్లకువా-మోల్గి రహదారిపై ఇవాళ (ఆదివారం) ఘోర స్కూల్ బస్సు ప్రమాదం జరిగింది. దేవ్‌గోయ్ ఘాట్ వద్ద ఒక స్కూల్ బస్సు 100 నుంచి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా, దాదాపు 20 నుండి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన విద్యార్థి బస్సు కింద నలిగిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: సారీ మెగాస్టార్..! చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ..
Nandurbar School Bus Accident
#Maharashtra नंदुरबार के अक्कलकुवा तालुका के अमलीबारी घाट में आज शाम हुआ दर्दनाक सड़क हादसा..दिवाली की छुट्टियों के बाद छात्रों को स्कूल वापस ले जा रही एक स्कूल बस 150 फीट गहरी खाई में गिर गई..इस हादसे में एक छात्र की मौके पर ही मौत हो गई..@TNNavbharat@NANDURBARPOLICEpic.twitter.com/PJ02quA05H
— Atul singh (@atuljmd123) November 9, 2025
Also Read: SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!
మోల్గి గ్రామం నుండి అక్లకువాకు వెళ్తున్న విద్యార్థుల బస్సు అమ్లిబారి ప్రాంతంలో రోడ్డును ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు 100 - 150 అడుగుల లోతైన లోయలో పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 12 నుండి 13 ఏళ్ల విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా వారు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే గాయపడిన మిగిలిన విద్యార్థులను సంఘటన స్థలం నుండి బయటకు తీసుకువచ్చి వారందరినీ అక్లకువా గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా ఒక టూర్‌కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?
ప్రమాదాలకు గురయ్యే ప్రాంతం
కాగా నందూర్బార్ నగరానికి సమీపంలో ఉన్న దేవ్‌గోయ్ ఘాట్.. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పదునైన, గమ్మత్తైన మలుపు ఉంది. ఇప్పటికి ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ఈ ఘాట్ వద్ద ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఘారమైన ప్రమాదం జరిగింది.
Follow Us