Nara Rohit: కష్టకాలంలో పెదనాన్న అండగా నిలిచారు: నారా రోహిత్! తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ..తమకు అండగా నిలిచిన వారందరికీ నారా రోహిత్ కృతజ్ఙతలు తెలిపారు.అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఙతలు అని పేర్కొన్నారు. By Bhavana 18 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Nara Rohit: ఏపీ ముఖ్యమంత్రి,తన పెదనాన్న నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆత్మీయులు, సన్నిహితులను ఉద్దేశించి నటుడు నారా రోహిత్ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ..తమకు అండగా నిలిచిన వారందరికీ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. Also Read: Delhi: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం! క్లిష్ట సమయంలో కష్టకాలంలో పెదనాన్న, పెద్దమ్మ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. '' తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. Also Read: Ap: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెదనాన్న, పెద్దమ్మ, లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినకు కృతజ్ఙతలు అని పేర్కొన్నారు. Also Read: AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..! రామ్మూర్తి నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకి సోదరుడు. అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. ఇతను 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. Also Read: High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే! 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు 1952లో నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు జన్మించాడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు నటుడు నారా రోహిత్ కాగా, మరొకరు గిరీష్. ఇటీవల నారా రోహిత్‌కి హీరోయిన్ శిరీషాతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. #Nara Ramamurthy naidu #rtv #nara rohit #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి