/rtv/media/media_files/2025/04/26/rwPgFgxavAOXQG9tEDbT.jpg)
vizianagaram man
ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కొడుకు కన్న తల్లిదండ్రులనే హతమార్చాడు. కని పెంచిన ప్రేమను మరచి.. కసాయివాడిలా ప్రవర్తించాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
ట్రాక్టర్‌తో గుద్ది హత్య
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో అప్పలనాయుడు, జయ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒక కుమార్తె, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. అయితే తమ వాటాలోని సగం ఆస్తిని గతంలో తమ కూతురి పేరుమీద రాశారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి రాజశేఖర్ తన తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
తాను ఉంటుండగా.. తన చెల్లికి వాటా ఇవ్వడమేంటని కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయంపై రాజశేఖర్ తన తల్లిదండ్రులతో గత కొంతకాలంగా గొడవలు పడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి సాగుతున్న ఈ వివాదం.. తాజాగా ఉగ్రరూపం దాల్చింది. తమ కుమార్తెకు ఇచ్చిన భూమిని రాజశేఖర్ స్వాధీనం చేసుకుని చదును చేస్తున్నాడు. అదే సమయంలో తల్లిదండ్రులు అతడిని అడ్డుకున్నారు.
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తన కోపాన్ని ఆపుకోలేక కొడుకు రాజశేఖర్.. తండ్రి అప్పలనాయుడు (55), తల్లి జయ (45)లను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. ఈ విషయం తెలిసి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
crime news | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news
Follow Us