Delhi: బాణాసంచాపై  ఢిల్లీలో శాశ్వత నిషేధం

దేశ రాజధానిలో గత కొన్నేళ్ళుగా దీపావళికి బాణాసంచా పేల్చడం నిషేధిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ నిషేధాన్ని శాశ్వతం చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ ఆప్ ప్రకటించింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

New Update
DK

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం చాలా ఏళ్ళ నుంచీ ఇబ్బంది పెడుతోంది. ఆగస్టు నుంచి జనవరి వరకూ ఇక్కడ విపరీతమైన వాయు కాలుష్యం ఉంటుంది ఇక్కడ. పంట నూర్పిడయాక చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటను తగులుబెడతారు. దీని వలన ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా ఉంటుంది. దానికి తోడు ఇక్కడ వాహనాల వలన కూడా చాలా పొల్యూషన్ ఉంటుంది. ఇతర కారణాలు కూడా దీనిని మరింత ఎక్కువ చేస్తోంది. ఆ కారణంగానే దీపావళికి బాణా సంచాను కాల్చడం  నిషేధిస్తూ వస్తున్నారు ఢిల్లీలో చాలా ఏళ్ళుగా. ఇప్పుడు ఈ  నిషేధాన్ని శాశ్వతం చేసింది అక్కడి ఆప్ ప్రభుత్వం.

సుప్రీంకోర్టు సీరియస్..

ఏడాది పొడవునా అన్ని రకాల బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు, ఆన్‌లైన్‌లో డెలివరీలతోపాటు వాటి వినియోగంపై నిషేధం విధిస్తూ ఢిల్లీ పర్యావరణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరులో ఆప్‌ గవర్నమెంటు ప్రకటించింది. కానీ దీపావళి తర్వాత కాలుష్యం మరింత పెరిగిపోయింది.  దీనిపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బాణసంచా నిషేధం అమలుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. తొందరగా దీనిపై క నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కారణంగానే ఆప్ ప్రభుత్వం ఇప్పుడు బాణాసంచా శాశ్వత నిషేధాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 

Also Read: TS: నాగారం గురుకుల పాఠశాలలో  33 మంది బాలికలకు అస్వస్థత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు