మానవ తప్పిదం వల్లనే సైనిక కమాండర్ బిపిన్ రావత్ చనిపోయారని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తేల్చింది. దీనికి సంధించిన రిపోర్ట్ ను లోక్‌సభకు ప్యానెల్ కమిటీ అందజేసింది. పైలెట్ చేసిన తప్పు వల్లనే రావత్ చనిపోయారని తేల్చింది. ప్రమాద సమయంలో వాతావరణం సడెన్‌గా మారిపోయింది...అదే సమయంలో మేఘాల్లోకి ఛాపర్ ప్రవేశించడం వలన ప్రమాదానికి గురైందని కమిటీ తెలిపింది. ఫ్లైట్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డుల విశ్లేషణ, సాక్షుల విచారణ తర్వాత ఫైలెట్ తప్పిదం వల్లనే ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్పింది.
Also Read: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
అసలేం జరిగింది..
2021లో ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులో క్రాష్ అయింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని సూలూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీకి బయలుదేరింది. అయితే ఫ్లైట్ ల్యాండ్ అవడానికి కరెక్ట్ గా 5 నిమిషాల ముందు కూనూర్ సమీపంలోని అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులికా రావత్‌తో సహా మొత్తం 12 మంది దుర్మరణం చెందారు. కేవలం ఒకే క వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ హెలికాప్టర్ క్రాష్ నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై అప్పుడే ఒక కమిటీని వేశారు. ఇప్పుడు మూడు ఏళ్ళ తర్వాత ప్యానెల్ కమిటీ నిన్న లోక్‌సభకు నివేదిక అందజేసింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం సంభవించిందని తేల్చి చెప్పింది.
Also Read: Delhi: బాణాసంచాపై ఢిల్లీలో శాశ్వత నిషేధం