వల్లభనేని వంశీతోపాటు మరో ఇద్దరు అరెస్ట్.. A1గా వంశీ

వైసీపీ నేత వల్లభనేని వంశీతోపాటు గురువారం మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్‌ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృ‌ష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

New Update
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఎస్పీ కీలక ప్రకటన!

హైదరాబాద్‌లో వైసీపీ నేత వల్లభనేని వంశీ గురువారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనతోపాటు ఈరోజు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్‌ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృ‌ష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

Also Read: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా వెంకట శివరామ కృష్ణప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిని చేరార్చు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నిందితులను మెడికల్ టెస్టుల కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. జీజీహెచ్‌లో వల్లభనేని వంశీకి  వైద్యపరీక్షలు చేయించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.  కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉదయం నుంచి వంశీ విచారణ ముగిసింది.

Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం

వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణ వేగవంతం చేసారు. ఈ కేసులో వంశీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు ఈ నెల 20న తీర్పు ఇవ్వనుంది. ఇదే సమయంలో విజయవాడ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ ను వంశీని కిడ్నాప్.. బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది. 

ఈ సమయంలోనే ఆకస్మికంగా సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. తాను ఇచ్చిన ఫిర్యాదును రెండు రోజుల క్రితం వెనక్కు తీసుకున్నారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం వెనుక అసలు విషయం బయటకు వచ్చింది. సత్య వర్ధన్‌ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు