వంశీ , కొడాలి...ఎవ్వడిని వదిలేదు లేదు | Nara lokesh Comment On Kodali Nani & Vamsi | RTV
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వంశీ తన కాన్వాయ్ లో విజయవాడ నుంచి హైదరాబాద్ బయలు దేరారు. ఈ క్రమంలో వాహన శ్రేణిలో వెనక నుంచి ఒక వాహనాన్ని మరొక వాహనం ఢీ కొట్టింది. ఎమ్మెల్యే వంశీ సహా కాన్వాయ్ లోని వారంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దెబ్బతిన్న వాహనాన్ని పక్కకు వదిలి.. మిగిలిన వాహనాలతో హైదరాబాద్ కు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.