AP: తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సహించేది లేదు–ఏపీ సీఎం చంద్రబాబు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అదానీ వ్యవహారం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇందులో జగన్ ఉండడం గురించి ఆయన ఇవాళ శాసనసభలో ప్రస్తావించారు. తప్పు చేసినది ఎవరైనా ఉపేక్షించమని చెప్పారు. చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు. 

author-image
By Manogna alamuru
New Update
22

 AP CM Chandrababu: 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అదానీ, జగన్ స్కామ్ గురించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్‌ను ఘోరంగా దెబ్బ తీశారని బాధను వ్యక్తం చేశారు. అమెరికాలో అదానీపై వేసిన ఛార్జ్‌ షీట్ గురించి అందరికీ తెలిసిందే. దీనిలో జగన్ కూడా ఉన్నారు. ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుంది. తప్పు అయినది ఏ ప్రభుత్వం అయినా...వ్యక్తి అయినా సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసలు జరిగినవన్నీ వింటుంటే చాలా బాధ వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇంతలా దెబ్బ తీస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయ స్థాయిలో, జగన్ రెడ్డి నాశనం చేసాడు. వీటిని పరిశీలించి, మరింత దర్యాప్తు చేయించి ప్రజల ముందు వస్తామని తెలిపారు చంద్రబాబు.  ఏది చేయాలో చేస్తూనే ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని అన్నారు. ఈ కేసు మీద ఆంధ్రప్రదేశ్‌లో కూడా విచారణ జరిపిస్తామని చంద్రబాబు తెలిపారు. 

Also Read :  నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

Also Read : Kalvakuntla Kavitha : కవిత రీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఆ సంచలన ఎజెండాతోనే ప్రజల్లోకి..!

Also Read: Adani: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Also Read :  వామ్మో..! విష్ణు క్యారెక్టర్ గురించి రోహిణి అలా అనేసిందేంటి.. నిఖిల్, పృథ్వీ కోసం రచ్చ రచ్చ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు