కవిత రీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఆ సంచలన ఎజెండాతోనే ప్రజల్లోకి..!

త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఎజెండాతోనే ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆమె రోజువారీగా బీసీ కులసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

New Update
Kavita

లిక్కర్‌ కేసులో అరెస్టయి ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అసలు బయట కనిపించడమే లేదు. కొన్నిరోజుల క్రితం ఆమె అనారోగ్యం పాలయ్యారనే వార్తలు కూడా వచ్చాయి.  కవిత రీ ఎంట్రీ ఎప్పుడు అనేదానిపై కేవలం బీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె రీ ఎంట్రీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యం వల్ల ఆమె విశ్రాంతి తీసుకున్నారని ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని.. త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కులగణన సర్వేకు సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: వాళ్లు నమాజ్ చేస్తే...తాము చాలీసా చదువుతాము..రాజాసింగ్‌ వార్నింగ్

MLC Kavitha Re-Entry

కవిత జైలుకు వెళ్లకముందు ఫూలే ఫ్రంట్‌ ఏర్పాటు చేసి బీసీల పక్షాన పోరాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఏజెండాతోనే ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆమె రోజువారీగా బీసీ కులసంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సర్వేకి సంబంధించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకంటున్నటున్నారని తెలుస్తోంది. బీసీ సంఘావు, కుల సంఘాలు చెబుతున్న అభ్యంతరాలను తెలుసుకంటూ ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశాలపై వాళ్లతో చర్చిస్తున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. 

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

మొత్తానికి ఆమె మళ్లీ బీసీ ఏజెండాతోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. జాగృతి శ్రేణులు కూడా కవితను రోజూ కలుస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఫూలే ఫ్రంట్‌ను కూడా కవిత యాక్టివేట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకొని ఫూలే ఫ్రంట్‌ ఎజెండాతో కులగణనపై ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్‌ను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. కులసంఘాల నేతలు లేవనెత్తిన అంశాలను కమిషన్ ముందు ప్రస్తావించాలని సర్వేలో మార్పులు చేయించాలని కోరనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఇప్పటికే సగం సర్వే పూర్తి అయినందువల్ల ఆమె చెప్పిన మార్పులు కమిషన్ చేస్తుందా ? లేదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Also Read: వారిని పక్కాగా ఊచలు లెక్కబెట్టిస్తా.. వరంగల్ లో రేవంత్ సంచలన స్పీచ్

 ఇదిలాఉండగా.. లిక్కర్‌ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఆమె బయట ఎక్కడా కూడా కనిపించలేదు. కనీసం కార్యకర్తలతో కూడా సమావేశం కాలేదు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో మరికొన్ని రోజుల్లో కవిత రీ ఎంట్రీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

 

#brs #telugu-news #telangana-news #mlc kavitha
Advertisment
Advertisment
తాజా కథనాలు