నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'సారంగపాణి జాతకం'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. హీరో జాతకం, జీవితం చుట్టూ సాగిన ఈ టీజర్ లో కామెడీ సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

New Update

అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.  ఫన్నీ సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ నవ్వులు పూయించింది. ఈ మూవీలో ప్రియదర్శి టైటిల్ రోల్ 'సారంగపాణి' పాత్రను పోషించాడు. సారంగపాణి జాతకం, జీవితం చుట్టూ సాగిన ఈ కథలో దర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతని చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించగా.. వెన్నెల కిషోర్, వైవా హర్ష, VK నరేష్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

ఈ మూవీతో పాటు ప్రియదర్శి  నేచురల్ స్టార్ నాని సమర్పణలో 'కోర్ట్' అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో నిందితుడిగా చేసిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

 ఇది కూడా చదవండి: Lagacharla: మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు