AP News: విజయవాడలో దారుణం.. నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్!

విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

New Update
Vijayawada Crime News

Vijayawada Crime News

AP News: మానవ హక్కులను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, నేరాల నియంత్రణ, దర్యాప్తు, నేరస్తులను పట్టుకోవడంలో వారు నిమగ్నమై ఉంటారు. సమాజంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణకు నిలబడేవారు పోలీసులు. వారి సేవలు నిస్వార్థమైనవి. అయితే విజయవాడ నగరంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నడిరోడ్డుపై గొడవకు దిగి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్ వద్ద ఒక పురుషుడు, మహిళ మధ్య గొడవ జరుగుతున్నట్లు కోటేశ్వరరావుకు సమాచారం అందింది.  

అర్ధరాత్రి పోలీసుల మధ్య ఘర్షణ..

ఆయన వెంటనే అక్కడికి చేరుకుని చూశారు. గొడవ పడుతున్న వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్‌గా గుర్తించారు. అప్పటికే గొడవ తీవ్రం కావడంతో నైట్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు శ్రీనివాస్ నాయక్‌పై చేయి చేసుకున్నారు. అదే సమయంలో శ్రీనివాస్ నాయక్‌తో గొడవ పడుతున్న మహిళ జోక్యం చేసుకుని.. కోటేశ్వరరావుపై చేయి చేసుకోవడంపై ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమె యూనిఫాంలో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. ఈ సంఘటనతో ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య గొడవ మరింత పెరిగింది. 

ఇది కూడా చదవండి: మరో అమ్మాయితో భర్త ఎఫైర్.. తట్టుకోలేకపోయిన భార్య ఏం చేసిందంటే..

ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. విధులకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న మహిళపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన వారే ఇలా ప్రవర్తించడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 52 ఏళ్ల ఆంటీతో ఎఫైర్.. 26 ఏళ్ల యువకుడు ఏం చేశాడంటే!

Advertisment
తాజా కథనాలు