AP TET : AP TET ఫలితాలు విడుదల

ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్‌ లో నిర్వహించిన టెట్ ఫలితాలను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు.

New Update
FotoJet (12)

AP TET

AP TET : ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్‌ లో నిర్వహించిన టెట్ ఫలితాలను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు. వీరిలో 97,560 మంది ఉత్తీర్ణులు అయినట్లు తెలిపారు. ఫలితాల కోసం https://tet2dsc.apcfss.in/ క్లిక్‌ చేయాలని సూచించారు. టెట్ ఫలితాలను 9552300009 వాట్సప్‌ నెంబర్‌తోనూ తెలుసుకోవచ్చని కన్వీనర్ వెల్లడించారు.  

డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం, మధ్యాహ్నం సెషన్లవారీగా ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించగా డిసెంబర్ 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తయ్యాయి. ముందుగా కొన్ని పేపర్ల ప్రాథమిక కీలను విడుదల చేయగా… ఆ తర్వాత మిగతా పేపర్ల ప్రాథమిక కీలను కూడా ప్రకటించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. పరిశీలించిన తర్వాత ఇవాళ (జనవరి 9) ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Advertisment
తాజా కథనాలు